Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో పసిడి, వెండి ధరవరలు

శుక్రవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభధర రూ.26,800 పలికింది. విజయవాడలో రూ.26,600 వద్ద ప్రారంభమై, రూ.26,200 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.26,320 వద్ద ప్రారంభమై, రూ.27,100 వద్ద ముగింపు నమోదైంది. ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.26,550 ఉంటే, ముగింపు ధర రూ.26,820గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.26,300 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.26,800 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా రాజమండ్రిలో రూ.46,500 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.45,200 పలికింది.

More Telugu News